శ్రీకాకుళంలో సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రైతులు రెండో రోజు నిరసన పాదయాత్ర చేపట్టారు. నారాయణపురం భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని 50 ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదని సిపిఎం నేతలు విమర్శించారు. ఈ పాదయాత్ర రైతుల పోరాటంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, రైతులకు సిపిఎం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. పాదయాత్రకు వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి.