రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో తెలుగుదేశం,
జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతుగా నిలిచి, తమ విలువైన ఓట్లతో ప్రజా తీర్పును అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజామోదంగా ఈ
ఎన్నికలు నిలుస్తాయన్నారు.