ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనం...వ్యక్తి మృతి

12చూసినవారు
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనం...వ్యక్తి  మృతి
ఎల్.ఎన్.పేట సెంటర్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మిరియాపల్లి గ్రామానికి చెందిన ఎర్లంకి జగన్నాథం నడుపుతున్న ద్విచక్రవాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిత్యవసర సరుకుల కోసం గ్రామం నుంచి వచ్చిన జగన్నాథం ఇలా ప్రమాదానికి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జగన్నాథం మరణంతో మిరియాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Job Suitcase

Jobs near you