శ్రీకాకుళంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

635చూసినవారు
శ్రీకాకుళంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
పర్యాటక రంగ సమగ్ర అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందని సెటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి. విశ్వేశ్వరరావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జిల్లాలోని పురాతన దేవాలయాలు, సుందరమైన సముద్ర తీర ప్రాంతాలు, ప్రకృతి రమణీయమైన అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్