టెక్కలిలో సోమవారం సాయంత్రం మెల్ల మెల్లగా తుఫాను వాతావరణం తలపించి భారీ వర్షం కురిసింది. అందరూ ఇళ్లకు చేరే సమయం కావడంతో , కొంచెం ఇబ్బంది పడినా వాతావరణం చల్లబడటంతో హర్షం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , ప్రజల అప్రమత్తంగా ఉండాలని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఇదివరకే కలెక్టర్ ప్రకటించారు.