ఆగని ఆర్టీసీ బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు

0చూసినవారు
ఆగని ఆర్టీసీ బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థ ముందంజలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే అందులో పనిచేసే అధికారులు సిబ్బంది మాత్రం తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టెక్కలి పట్టణంలో స్థానిక రైల్వే గేట్ సమీపంలో టెక్కలి నుండి పాతపట్నం వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు చాలామంది గంటలు తరబడి నిరీక్షణ చేయగా వచ్చిన బస్సు వచ్చినట్లే కనీసం ఆపకుండా వెనుకబడిన పట్టించుకోకుండా వెళ్లిపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు మామూలు కాదని ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని పై ఉన్నత అధికారులకు తెలియ పరిచిన పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్