విద్యార్థులు, రైతులకు వెంకటరావు అండ

6చూసినవారు
విద్యార్థులు, రైతులకు వెంకటరావు అండ
శ్రీకాకుళం, టెక్కలికి చెందిన విద్యావేత్త, దాత తర్ర వెంకటరావు విద్యార్థుల అభివృద్ధి, రైతుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్నారు. తిలారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న క్రీడా మైదానాన్ని తన సొంత నిధులతో సమతలీకరించి రన్నింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల ప్రాధాన్యతను వివరించారు. నారాయణవలస ఎత్తిపోతల పథకాన్ని గత ఎనిమిదేళ్లుగా రైతుల నుంచి ఎలాంటి చందాలు వసూలు చేయకుండా నడిపిస్తూ పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు. ఆయన సేవలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్