వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కనిపించకపోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో విచారణకు కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు చెప్పిన దువ్వాడ ఆ తర్వాత అందుబాటులోకి రాలేదని అనుచరులు తెలిపారు. అయితే గంటలు గడుస్తున్నా శ్రీనివాస్ స్టేషన్ వద్దకు చేరుకోలేదని పోలీసులు చెప్తున్నారు. ఆయన ఫోన్, డ్రైవర్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోందని పేర్కొంటున్నారు. మరోవైపు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండవచ్చని దివ్వెల మాధురి ఆరోపించారు.