ఆమదాలవలస: అస్తవ్యస్తంగా రహదారులు.. కృషి చేస్తామన్న ఎమ్మెల్యే

4చూసినవారు
ఆమదాలవలస: అస్తవ్యస్తంగా రహదారులు.. కృషి చేస్తామన్న ఎమ్మెల్యే
ఆమదాలవలస మండలం రామచంద్రాపురం, పురుషోత్తపురం, దూసి తొగరాం గ్రామాల్లో రహదారులు దారుణంగా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతోందని, దీనివల్ల వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా, త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్