ఆముదాలవలస మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులుగా బండి లక్ష్మీకాంతంను ఎంపిక చేసినట్లు
టీడీపీ కార్యాలయం ప్రకటించింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ కమిటీల్లో ఆముదాలవలస మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులను నియమించారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పదిమంది డైరెక్టర్ల జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీలో ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో అక్కి వలస గ్రామానికి చెందిన బండి లక్ష్మీకాంతం వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందింది.