ఆముదాలవలస: పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్

7చూసినవారు
ఆముదాలవలస: పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్
ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి శనివారం ఉదయం 13వ వార్డులో పర్యటించి, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న వాటర్ స్టార్మ్ డ్రెయిన్, నల్లా డ్రెయిన్ శుభ్రత పనులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి, ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.