ఆముదాలవలస: నీటి సరఫరాలో అంతరాయం

70చూసినవారు
ఆముదాలవలస: నీటి సరఫరాలో అంతరాయం
ఆమదాలవలసలో కొత్తవలస పంపు హౌస్ వద్ద మోటార్ల మరమ్మతుల కారణంగా శనివారం తాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెంకయ్య పేట, లక్షుడు పేట, బొడ్డేపల్లిపేట, కుద్దిరాం, రావికంటి పేట ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్