ఆమదాలవలస మండలం దన్నానపేట సమీపంలో గురువారం రాత్రి కళాశాల బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒడిశాలోని పర్లాఖెముండి సెంచూరియన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఒక ప్రయాణికుడు, మరో మహిళతో పాటు డ్రైవర్ ఉన్నారు. గురుగుబెల్లి స్రవంతి అనే విద్యార్థిని, ప్రయాణికుడు మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలవడంతో వారిని శ్రీకాకుళం తరలించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.