ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

129చూసినవారు
ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బలగ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో గురువారం, డెమొక్రటిక్ పి ఆర్ టి యు రాష్ట్ర అనుబంధం విద్యా సామాజిక సేవా విభాగం జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఉప విద్యాశాఖ అధికారి ఆర్. విజయ కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయ సేవాదళ్ ను అభినందించారు. ఉపాధ్యాయ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను, పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాలను వివరించారు. సహాయం పొందేందుకు అవసరమైన విద్యార్థులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్