యోగతోనే ఆరోగ్యకర జీవనం: మున్సిపల్ కమిషనర్ రవి

0చూసినవారు
ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి మాట్లాడుతూ, యోగాతోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, మెప్మా, స్వయం సహాయక సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్