ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, పొందూరు ఖద్దరుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఆ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఈ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.