శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆముదాలవలస పట్టణంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో మహిళా భక్తులు అర్చకులు కామేశ్వరరావు పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తుల సందడి అధికంగా నెలకొంది. పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.