ఆమదాలవలస నియోజకవర్గంలోని బుడ్డివలస గ్రామంలో రూ.78 లక్షల వ్యయంతో, AIIB నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్డుతో గ్రామ ప్రజల కలను నెరవేర్చామని, రాకపోకలు సులభతరం అవుతాయని, విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.