
మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి తండ్రి
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో దళిత కాలనీలో పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి మాముడూరు పుల్లయ్య (70) తన కొడుకు మామిడూరు మస్తానయ్య (33)ను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.




