మేడే: కార్మిక హక్కులను కాలరాస్తున్నారని సిఐటియు ఆరోపణ

586చూసినవారు
మే 1న కార్మికవర్గ దీక్షాదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాలు, పరిశ్రమల వద్ద జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళంలో జరిగిన సిఐటియు జిల్లా విస్తృత సమావేశంలో మేడే విప్లవ సంప్రదాయాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్మికవర్గం పోరాడి సాధించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వారు ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్