ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో పర్యటించినప్పుడు, గిరిజనులు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెన్షన్ల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యేను వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ప్లాంట్ వల్ల ఎవరికీ హాని జరగదని, స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, గిరిజనులు మాత్రం ప్లాంట్ నిర్మాణం వద్దని స్పష్టం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.