పొందూరు మండలంలో తానే గ్రామానికి చెందిన పాపినాయుడు (65) అనే వృద్ధుడు మద్యం మత్తులో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటనలో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని కుటుంబ సభ్యులు రిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.