ఆదివారం పొందూరు మండలం పెనుబర్తిలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సహాయం అందించే దిశగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటుందని, స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ఆనందదాయకమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.