
డబ్బులు ఎగ్గొట్టేందుకు యత్నం.. బైకును ఈడ్చుకెళ్లిన థార్ డ్రైవర్(వీడియో)
యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన హర్ష్(22) అనే వ్యక్తి స్థానిక ధుమ్ మానిక్‌పూర్ ఏరియాలోని ఒక పెట్రోల్ బంకులో శుక్రవారం మహీంద్రా థార్‌లో డీజిల్ పోయించుకున్నాడు. అయితే, డీజిల్‌కు బిల్లు చెల్లించకుండా వేగంగా వెళ్లిపోయాడు. కుల్దీప్ శర్మ అనే పెట్రోల్ బంక్ సిబ్బంది బైకుపై అతడిని వెంబడించాడు. ఈ క్రమంలో మహీంద్రా థార్ కింద ఆ బైకు పడిపోయింది. అయినప్పటికీ డ్రైవర్.. థార్‌ను ఆపకుండా అలాగే పోనిచ్చాడు. దాదాపు బైకును పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. చివరకు ఒక టోల్ ప్లాజా వద్ద థార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




