రణస్థలం: పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

455చూసినవారు
సోమవారం కంచిలి నుండి విశాఖపట్నం వైపు 5 వాహనాలలో 17 పశువులను అక్రమంగా తరలిస్తుండగా రణస్థలం ప్రధాన రహదారిలో పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారంతో గస్తీ నిర్వహించి, వేకువ జామున వాహనాలను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు. పశువులను గోసాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ఘటనలో పదిమందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్