కూటమి ప్రభుత్వ హయాంలో నేరుగా ఎన్టీఆర్ భద్రత పింఛన్లు ఇంటికే అందిస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సోమవారం సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస గ్రామంలో భద్రత భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేసి, అవి సరిగ్గా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.