శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాస రెండో సోమవారం సందర్భంగా అయ్యప్పస్వామి మాలధారణదీక్ష స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జి. హరిస్వామి, సనపల రాజశేఖర్, ఎస్. రాజు, బమ్మిడి అమ్మినాయుడు, పైడి అచ్యుతరావు, చింతాడ వెంకటరమణల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహణ సభ్యులు ఏ. సురేష్ కూడా పాల్గొన్నారు.