అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

1చూసినవారు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ఆమదాలవలస పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని బార్లో ఆదివారం సరిబిల్లి దుర్గారావు (30) అనుమానాస్పదంగా మృతి చెందాడు. బార్లో పనిచేస్తున్న అతన్ని కలవడానికి వచ్చిన అతని సోదరుడు మొదటి అంతస్తులో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి 108కు సమాచారం అందించాడు. వారు వచ్చి చూసే సరికి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గతంలో జూదమాడుతున్న సమయంలో దుర్గారావు, అతని సోదరుడిపై కొందరు దాడి చేసిన ఘటన వైరల్ అవ్వడంతో పాత కక్షల నేపథ్యంలోనే దాడి చేసి చంపవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్