
బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కేసు కలకలం
లావేరు మండలం బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పది రోజుల క్రితం వ్యవసాయ పనులు చేస్తుండగా పేడ పురుగు కుట్టడంతో జ్వరం వచ్చింది. వైద్య పరీక్షల్లో టైఫస్ వ్యాధిగా నిర్ధారణ అయింది. చికిత్సతో వృద్ధుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.



































