ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్య పేటలోని దేవి ఆశ్రమం పీఠంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. పీఠాధిపతి బాల భాస్కర శర్మ ఆయనకు స్వాగతం పలికి, మాఘమాసం శుక్రవారం నిర్వహించే పూజ కార్యక్రమాలను వివరించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.