ఎచ్చెర్లలో పాత జాతీయ రహదారిపై వెళుతున్న లారీ డ్రైవర్ భాస్కరరావు ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీకాకుళం పట్టణం నుంచి చిలకపాలెం వెళుతుండగా కింతలి మిల్లు సమీపంలో ఫ్లైఓవర్ వంతెన వద్ద లారీని ఆపి దిగిన ఆయన, కాస్త అసౌకర్యానికి గురై వాంతులు చేసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విజయనగరం పట్టణం రైతు బజార్ వీధికి చెందిన మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు.