ఎచ్చెర్ల సమీపంలో ఫ్లై ఓవర్పై నుంచి శ్రీకాకుళం వైపునకు వెళ్తున్న కోడిగుడ్ల లారీ గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.