బూటకపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు తో నేడు ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. ఆదివారం లావేరు మండలంలో వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి పాలన అంతా దగా అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.