జి.సిగడాం మండలం పున్నాం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కూర్మాన అరుణ కుమారి విద్యా బోధనలో తన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తున్నారు. ఆమె బోధనా పద్ధతిని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇటీవల 'X' వేదికగా అభినందించారు. అరుణ కుమారి బొమ్మలు, బోధనోపకరణాలను ఉపయోగించి, విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఆటపాటలతో పాఠ్యాంశాలను వివరిస్తున్నారు. ప్రయోగాత్మక పద్ధతిలో విద్యను అందించడం ద్వారా విద్యార్థులు సులభంగా గుర్తుంచుకునేలా చేస్తున్నారు.