ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఈశ్వరరావు శుక్రవారం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని వివిధ ప్రజా సమస్యలపై చర్చించారు. పలు అంశాలపై దృష్టి సారించి పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ భరోసా ఇచ్చారు.