రణస్థలం: భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

3చూసినవారు
రణస్థలం: భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భద్రత భరోసా పింఛన్లను ప్రభుత్వం అందిస్తుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం రణస్థలం మండలం కృష్ణాపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో, ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లను ముందుగానే శనివారం లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్