ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు బుధవారం రణస్థలం మండలం కమ్మసిగడం జంక్షన్లో 'ప్రతి బుధవారం స్వచ్ఛ పదం' కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో స్వచ్ఛత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా పరిశుభ్రత పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు స్వచ్ఛతపై సొంతంగా ఆలోచించి, పరిశుభ్రత వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు.