గురువారం రణస్థలం మండల కేంద్రంలో
ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుందని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.