తాళ్లవలసలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో పురుషోత్తం, శశిభూషణరావు, కాంతమ్మ, పాపారావులకు చెందిన వరికుప్పలు భారీగా దగ్ధమయ్యాయి. సమీపంలోని చెత్తకుప్పలకు అంటుకున్న మంటలు వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏడాదంతా కష్టపడి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో బాధితులు తీవ్రంగా రోదిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.