జి.సిగడాంలోని ఓ పాఠశాల వద్ద మంగళవారం ఇద్దరు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పదంగా సంచరించడాన్ని ప్రిన్సిపల్, స్థానికులు గుర్తించారు. ప్రశ్నించగా పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పట్టుకుని, పిల్లల్ని కిడ్నాప్ చేసే దొంగలని పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఎస్సై వివరణ కోరగా, ఆ మహిళలు గ్రామాల్లో పాత సామాన్లు అమ్ముకునే వారని, వారిని విచారిస్తున్నామని తెలిపారు.