ఉరేసుకుని యువతి ఆత్మహత్య

4చూసినవారు
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిట్టివలస గ్రామానికి చెందిన జి. దుర్గాభవానీ (24) అనే యువతి విజయనగరంలో అద్దె గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న ఆమె, సుమారు ఏడాదిన్నరగా విజయనగరంలో మరో యువతితో కలిసి నివాసం ఉంటోంది. గత నెల 30న రాత్రి 7.30 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని కనిపించింది. గదిలో ఉన్న మరో యువతి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్