Mar 06, 2026, 02:03 IST/కరీంనగర్
కరీంనగర్
కుమారుడి పెళ్లికి ముందే తల్లి దారుణ హత్య!
Mar 06, 2026, 02:03 IST
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఈరెళ్ల గౌరమ్మ (65)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజుల్లో పెద్ద కుమారుడు మహేష్ వివాహం జరగాల్సి ఉండగా, ఈ దారుణం చోటుచేసుకుంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుల ఆచూకీ లభించలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టినట్లు సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.