శక్తి యాప్ పై 150 మందికి అవగాహన, మహిళా రక్షణపై దృష్టి

554చూసినవారు
శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మండలం కోర్ల కోట గ్రామంలో శుక్రవారం, శక్తి టీం ఇంచార్జి HC తమ్మినేని అమ్మాజీ ఆధ్వర్యంలో 150 మంది ఉపాధి హామీ కార్మికులకు శక్తి యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలబాలికల రక్షణ, గృహహింస, పోక్సో చట్టం, ఆపరేషన్ దండయాన్, సైబర్ నేరాల నివారణ, ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాధాన్యత, మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే చట్టపరమైన సమస్యలు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందన పొందింది.

సంబంధిత పోస్ట్