సోంపేట మండలం పాలవలస గ్రామంలో బుధవారం పొలం పిలుస్తొంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. నరసింహమూర్తి, ప్రవీణ్ కుమార్ వేరుశనగ పంట పొలాలను సందర్శించారు. పొలం పరిశీలన చేస్తూ వేరుశనగ విత్తనశుద్ధి వలన మొక్కలు తేటగా కనిపిస్తున్నాయని రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు యస్. లక్ష్మీనారాయణ, రాజు, కేశవరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.