అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

1080చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
పోలాకి మండలంలోని బెలమర గ్రామంలో దండుపాటి అప్పమ్మ (68) బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె కుమారుడు వెంకటరమణ తల్లి చనిపోయిందని చెప్పడంతో స్థానికులకు అనుమానం కలిగింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రంజిత్ కుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ శ్రీనివాసరావు మృతదేహాన్ని పరిశీలించారు. అప్పమ్మ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్