పంట రుణాలు పునరుద్ధరించుకోవాలని రైతులకు సూచన

158చూసినవారు
పంట రుణాలు పునరుద్ధరించుకోవాలని రైతులకు సూచన
కొత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఛైర్మెన్ మాతల గాంధి సోమవారం మాట్లాడుతూ, పంట రుణాలు తీసుకున్న రైతులు మార్చి 14వ తేదీ లోగా తమ రుణాలను పునరుద్ధరించుకోవాలని కోరారు. 7 శాతం వడ్డీ చెల్లించి, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, భూమి 1B పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించి, తిరిగి రుణం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్