ఇచ్ఛాపురం పట్టణం 17వ వార్డు సంతపేట వీధిలోని జాజుల రాజుకు చెందిన దుకాణంలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా కాలిపోయి ఆస్తినష్టం జరిగింది. సమాచారం అందుకున్న ఎంఆర్ఎ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.