జలుమూరు మండలం అల్లాడ గ్రామానికి చెందిన తలగాన త్రినాధరావు అనే వృద్ధుడు పెన్షన్ మంజూరు కాక, కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎవరో ఒకరు ఒక పూట భోజనం పెడుతున్నారని, కాలు పనిచేయని తనను భార్య, కొడుకు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దాటిన వారికి కూటమి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుందని చెప్పినప్పటికీ అది అమలు కాలేదని ఆయన తెలిపారు.