కంచిలి మండలం జలంత్రకోట గ్రామంలో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న షావుకారు అనే మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి 50 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దాడి చేసి సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ సిఐ రమణ తెలిపారు. అరెస్టు అయిన మహిళను సోంపేట కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.