కవిటి మండలం బోరివంక సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ యగ్నేశ్వరరావు తెలిపారు. గురువారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు బెజ్జిపుట్టుగ, దూగాన పుట్టుగ పంచాయతీలలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.